Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైరా వ‌సీంకి రాష్ట్ర‌ప‌తి అవార్డు... బాల‌ల దినోత్స‌వం రోజున జ‌రిగిన స‌త్కారం

  • ఇన్‌స్టాగ్రాంలో వెల్ల‌డించిన రాష్ట్ర‌ప‌తి నిల‌యం
  • నేష‌న‌ల్ చైల్డ్ అవార్డ్ ఫ‌ర్ ఎక్సెప్ష‌న‌ల్ అచీవర్‌గా గుర్తింపు
  • దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ చిత్రాల్లో ఆద‌ర్శాత్మ‌క పాత్ర‌లు చేసిన జైరా
'దంగ‌ల్‌', 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' సినిమాల్లో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే పాత్ర‌లు చేసిన న‌టి జైరా వ‌సీంను బాలల దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ స‌త్కరించారు. నేష‌నల్ చైల్డ్ అవార్డ్ ఫ‌ర్ ఎక్సెప్ష‌న‌ల్ అచీవ్‌మెంట్ 2017గా ఆమెను స‌త్కరించారు. ఈ స‌త్కార స‌భ‌కు సంబంధించిన వీడియోను రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది.

'చిన్న వ‌య‌సులోనే బాల్య వివాహం, లైంగిక వేధింపులు, సాధికార‌త, లింగ‌బేధం వంటి సామాజిక అంశాల‌తో కూడిన చిత్రాలలో ఆమె నటించింది. అంతేకాదు, త‌న న‌ట‌న ద్వారా 'బేటీ బ‌చావో బేటీ ప‌డావో' భావ‌న‌కు ప్ర‌చారం క‌ల్పించింది. స‌మాజంలో ఎంతోమంది బాలిక‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచింది' అంటూ పోస్ట్ పెట్టారు.
zaira wasim
presindent award
children's day

More Telugu News